NTV Telugu Site icon

Telangana Rains: వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

Telangana Rain Alert

Telangana Rain Alert

Telangana Rains: కొన్ని రోజులు కురుస్తున్న వాలతో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. గురువారం సాయంత్రం ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిశాయి. భాగ్యనగరంలో కురిసిన వర్షానికి ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు అంటే శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు.

Read also: Potholed Roads: రోడ్లు గుంతలు పడ్డ ఎవరు పట్టించుకోరు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలే..

ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 – 50 కి.మీ. వేగంతో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, యాదాద్రి భువనగిరిలో మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read also: Wife Kills Husband: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. మూణ్నెళ్ల తర్వాత…

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) విభాగం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో ఎలాంటి ప్రయాణాలు చేయవద్దని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి సూచించారు. మండలాల వారీగా వర్ష సూచనను డీఆర్‌ఎఫ్‌ఎక్స్ ఖాతా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. వరద నీరు నిలిచినా, చెట్లు కూలినా, కొమ్మలు విరిగిపోయినా జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూం నంబర్‌ 040-21111111, డీఆర్‌ఎఫ్‌ నంబర్‌ 9000113667కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Read also: Telangana Rains: రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన.. దిక్కుతోచని స్థితిలో రైతన్న

సాయంత్రం 4.40 నుంచి 6 గంటల వరకు, 6 తర్వాత వర్షం తగ్గే అవకాశం ఉందని సూచించారు. సాయంత్రం మరో గంటపాటు వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్ష సూచనను దృష్టిలో ఉంచుకుని షిఫ్ట్ టైమింగ్ మార్చుకోవాలని కోరింది. వర్షం సమయంలో బయటకు రావడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరారు. వర్షం కురిస్తే ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా వీలైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని జీహెచ్‌ఎంసీ సూచిస్తోంది.
Telangana: అలర్ట్‌.. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్