Site icon NTV Telugu

MLA Sri Ganesh : ఎమ్మెల్యే శ్రీగణేష్ పై దాడికి యత్నం.. కాన్వాయ్‌ని వెంబడించిన 30 మంది యువకులు

Mla Sriganesh

Mla Sriganesh

హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన సంఘటన చోటు చేసుకుంది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీగణేష్ కాన్వాయ్‌పై సుమారు 30 మంది యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన ఓయూ పోలీస్ స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో జరిగింది.

సమాచారం ప్రకారం, మాణికేశ్వర్ నగర్‌లో జరుగుతున్న బోనాల జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌ను యువకులు అడ్డగించారు. వారు కాన్వాయ్‌లో ఉన్న గన్‌మెన్‌ల వెపన్స్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొనగా, ఎమ్మెల్యే శ్రీగణేష్ కారులోనుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండిపోయారు.

తరువాత శ్రీగణేష్ సమీపంలోని ఓయూ పీఎస్ పోలీసులను ఆశ్రయించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకులను వెనక్కు నెట్టారు. దాడి యత్నం వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.

మాణికేశ్వర్ నగర్‌లో జరుగుతున్న బోనాల జాతరకు వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది. స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడి ప్రయత్నంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు.

HHVM : ప్రీమియర్ షోలు.. వీరమల్లుకు కలిసొస్తాయా..?

Exit mobile version