Site icon NTV Telugu

HYD Metro : మరోసారి మెట్రో ట్రైన్‌లో సాంకేతిక సమస్య.. రెండు వైపులా నిలిచిన మెట్రో రైళ్లు..

Metro

Metro

HYD Metro : నగరవాసులకు అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందించే హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్ – రాయదుర్గం (బ్లూ లైన్) మార్గంలో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయదుర్గం వైపు వెళ్తున్న మెట్రో రైలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్‌లో అకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు 12 నిమిషాల పాటు రైలు అక్కడే నిలిచిపోయింది.

TC Rajan Dead: పలమనేరు మాజీ ఎమ్మెల్యే రాజన్ కన్నుమూత.. నిరాడంబర జీవనానికి నిలువెత్తు నిదర్శనం!

దీని ప్రభావంతో ఈ మార్గంలోని ఇరువైపులా (అమీర్‌పేట్ , రాయదుర్గం వైపు) నడిచే రైళ్లపై ప్రభావం పడింది. ఒక్కసారిగా రైళ్లు నిలిచిపోవడంతో కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో సిబ్బంది వెంటనే స్పందించి సాంకేతిక లోపాన్ని సరిచేశారు. సమస్య క్లియర్ కావడంతో కొద్దిసేపటి క్రితమే రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మెట్రో అధికారులు తెలిపారు. అయితే, తరచూ ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Siddhu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ – సితార ఎంటరైన్మెంట్స్.. సినిమా స్టార్ట్

Exit mobile version