NTV Telugu Site icon

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్‌.. పెరగనున్న స్మార్ట్ కార్డ్స్ ధరలు..

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఛార్జీలు పెంచకుండా ప్రయాణికులపై కొంత భారం పడింది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత ఉంటుందని వెల్లడించిన మెట్రో అధికారులు.. రద్దీ సమయాల్లో రాయితీని ఎత్తివేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మెట్రో కార్డ్ మరియు క్యూఆర్ కోడ్‌పై ప్రయాణ ఛార్జీలపై 10 శాతం తగ్గింపు ఇస్తోంది. నేటి నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్డులపై ఎలాంటి తగ్గింపు ఉండదు. ఈ తగ్గింపు రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. సెలవు దినాల్లో ప్రయాణించేందుకు హాలిడే కార్డు ధర 59 రూపాయల నుంచి 99 రూపాయలకు పెరగనుంది. స్మార్ట్ కార్డుల ధరలు కూడా పెరగనున్నాయి.

అయితే.. ప్రస్తుతం సూపర్ సేవర్ ఆఫర్-59 మంచి ఆరదణ పొందింది. ఇప్పటి వరకు ఈ సూపర్ సేవర్ ఆఫర్ ద్వారా ప్రయాణికులు 1.3 మిలియన్ రైడ్‌లు తీసుకున్నారు. అయితే ఈ ఆఫర్ మార్చి 31న అంటే నిన్నటితో ముగిసింది. కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపు (హైదరాబాద్ మెట్రో స్మార్ట్ కార్డ్ ప్రయోజనాలు)ను తిరిగి ప్రవేశపెట్టడంతోపాటు ఈ సూపర్ సేవర్ ఆఫర్‌ను తిరిగి ప్రవేశపెడుతోంది L & T హైదరాబాద్ మెట్రో రైల్. అయితే ఈసారి సూపర్ సేవర్ ఆఫర్ రేట్లను రూ.100కి పెంచింది. అయితే లాభాలే ఎక్కువని చెబుతున్నారు. కొత్త సూపర్ సేవర్ ఆఫర్-99ని తీసుకువస్తోంది. ఇది ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు చెల్లుబాటు అవుతుంది. అయితే, సూపర్ సేవర్ ఆఫర్ ధరల పెరుగుదల గురించి ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.

Read also: US NATO Ambassador : నాటోలో భారత్ కు చోటు..? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ కామెంట్స్

ఈ సూపర్ సేవర్ ఆఫర్-99 ద్వారా, మెట్రో ప్రయాణికులు 100 నోటిఫైడ్ సెలవుల్లో కేవలం రూ.99తో అపరిమిత ప్రయాణాలు చేయవచ్చు. ఈ SSO-99 కొత్త ఆఫర్‌ను ఇప్పటికే ఉన్న సూపర్ సేవర్ ఆఫర్-59 స్మార్ట్ కార్డ్‌ల ద్వారా కూడా పొందవచ్చు. అయితే కొత్తగా ఈ కార్డు తీసుకునే వారు రూ.100 చెల్లించాలి. మెట్రో ఈ కొత్త సూపర్ సేవర్ ఆఫర్-99 కింద 100 నోటిఫైడ్ సెలవుల వివరాలను స్టేషన్లలో అలాగే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ మెట్రో రైలు సేవలను వినియోగించే ప్రయాణికులందరికీ ఇది వర్తిస్తుంది. ఈ కొత్త ఆఫర్ ఆఫీసులకు వెళ్లే వారితో పాటు సాధారణ ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం అందుబాటులో లేని కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డ్‌లు, డిజిటల్ క్యూఆర్ టిక్కెట్లపై 10 శాతం తగ్గింపును తొలగిస్తున్నట్లు మెట్రో తెలిపింది. ఈ CSC, QR టిక్కెట్‌ల తగ్గింపు ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు డిజిటల్ QR టిక్కెట్‌లపై ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇటీవల కొత్త ఆఫర్‌లుగా ప్రకటించిన దాంటో స్మార్ట్ కార్డ్ ఆఫీసు వేళలను తగ్గించింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు ప్రతిరోజూ 4.4 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. మూడు కారిడార్లలో 57 స్టేషన్లు, 69 కి.మీ. మేర సేవలందిస్తోంది.
Jaipur blasts case: నలుగురు నిందితులు విడుదల.. సుప్రీంను ఆశ్రయించిన రాజస్థాన్ సర్కార్

Show comments