NTV Telugu Site icon

Hyderabad Bike Stunt: పోతావ్ ర రేయ్.. గర్ల్ ఫ్రెండ్ వెనుక కూర్చుంటే ఇంత పైత్యం అవసరమా?

Instagram Reeels

Instagram Reeels

Hyderabad Bike Stunt: బైక్ నడుపుతున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ వెనుక ఉంటే అబ్బాయిలు ఊరికేఉంటారా? ఎక్కడాలేని ఉత్సాహం ఉంటుంది. అంతేకాదండోయ్ మబ్బుల్లో తేలియాడుతూ.. తుఫానులా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నట్లు ఊహించుకుంటారు. బైక్ లో కూర్చున్నప్పుడు అబ్బాయిని పట్టుకుని అమ్మాయి ఉంటే ఆహా.. ఆ ఊహ ఎంత బాగుంటుంది. ఊహించడం ఏమో గానీ.. నిజంగానే బైక్ పై వెళుతున్నప్పుడు అబ్బాయిని నడుము పట్టుకుని వెనుక అమ్మాయి కూర్చుని ఓ రీల్ చేస్తే ఇక చెప్పేది ఏమీ ఉండదూ దూసుకుపోవడమే.. ఆ బైక్ ఇతని ఊహలో ఊహించుకునే దానికన్నా.. అంతకన్నా ఎక్కువగానే ఆకాశంలో తేలిపోతుంది.

చేతిలో బైక్ ఉందనేది కూడా అబ్బాయి మరిచిపోయి అమ్మాయితో హాయిగా అలా..లా.. వెళ్లిపోతుంటాడు. ఇదంతా సరే రీల్స్ చేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. కానీ.. రీల్స్ చేస్తున్నప్పుడు అమ్మాయి వెనుక ఉండటం ఏమోగానీ కాస్త అటు ఇటూ బైక్ స్లిప్ అయితే ఇద్దరు ఆ గాల్లోనే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. ఏంటీ స్ట్రక్ అయ్యారా.. మరి.. ఇలాంటివి మనం చూసాం చూస్తున్నాం కూడా బాసూ. ఎన్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్న మనం మాత్రం పిచ్చోడి చేతిలో రాయి వున్నట్లే అంటూ మన చేతిలో బైక్.. బైక్ పై అమ్మాయి ఉందని చూస్తాం తప్పా ఓవర్ గా థింక్ చేస్తే మన ప్రాణాలు నిజంగానే ప్రాణాలు పోతాయనేది మర్చిపోతాం తాజాగా ఓ యువకుడు బండి నడుపుతూ ప్రియురాలితో రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Read also: Secret Camera: గదిలో రహస్యంగా కెమెరాలు.. యువతులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ యువకుడు తన ప్రియురాలిని వీపుపై ఎక్కించుకుని ప్రమాదకర విన్యాసాలు చేశాడు. హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి చేసిన స్టంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ యువకుడు బండి ముందు చక్రాన్ని గాలికి లేపి మెరుపు వేగంతో దూసుకుపోయాడు. ఆ అమ్మాయి కూడా ఎలాంటి భయం లేకుండా.. తన బాయ్‌ఫ్రెండ్‌పై.. వాళ్ల ఫ్రెండ్స్‌పై నమ్మకంతో స్టంట్‌ను ఎంజాయ్ చేస్తోంది.. ఈ విన్యాసాన్ని వీడియో తీస్తూ.. చీర్స్‌ చెప్పింది. అయితే.. ఈ వీడియో.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడానికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కానీ… తన వెనుక కూర్చున్న ప్రియురాలితో పనీరా నాయనా అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఇద్దరు హెల్మెట్ కూడా ధరించకపోవడం గమనార్హం.

Read also: BJP Meting: న్యూఢిల్లీలో మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కిషన్ రెడ్డి రెండోసారి డుమ్మా..!

అయితే.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ప్రధానంగా మాదాపూర్, గచ్చిబౌలి, తీగల బ్రిడ్జిపై యువకులు ఖరీదైన బైక్‌లతో విన్యాసాలు చేస్తున్నారు. అయితే ఇలాంటివి చేయొద్దని పోలీసులు చాలాసార్లు హెచ్చరిస్తున్నారు. కానీ యువతలో భయం లేదు. మళ్లీ ఇలాంటి పనులు చేస్తూ.. ప్రాణహాని లేకుండా.. తోటి వాహనదారులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇక ఇదే కాదు.. ఓ అందాల కార్యక్రమంలో బైక్ తో విన్యాసాలు చేశారు. పోలీసులు చూస్తుండగానే పట్టపగలు శిక్ష వేసినా.. ఏమీ చేయలేక ప్రేక్షకపాత్ర వహించారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినా పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ ప్రయాణించే రోడ్లపైనే ఇలాంటి సాహసాలు జరుగుతున్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Emergency Landing: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో రన్‌వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్