ట్రిఫుల్ ఐటీలు, ఐఐటీలలో విద్యార్ధులు తీవ్ర వత్తిడికి గురవుతున్నారు. సౌకర్యాల కొరతతో చదువుకోవడం కష్టంగా మారుతోంది. మొన్నటివరకూ బాసర iiit విద్యార్దులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సంగారెడ్డి జిల్లా కందిలో వున్న ఐఐటీలో ఎంటెక్ సెకండియర్ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లాలోని కందిలోని IIT (IIT Hyderabad) లో హైదరాబాద్ విద్యార్థి సూసైడ్ కేసు విద్యార్థి లోకాన్ని నివ్వెరపరిచేలా చేసింది. క్యాంపస్ లోని E బ్లాక్ లో రూం నెంబర్ 107 లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు రాహుల్ అనే విద్యార్థి. రూం నుంచి ఎంతకీ బయటకు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తోటి విద్యార్ధులు పోలీసులకు తెలియచేశారు. రూంలో రాహుల్ మంచానికి ఉరి వేసుకున్నాడు.
మంచానికి వేలాడుతున్న రాహుల్ మృతదేహం హృదయ విదారకంగా వుంది, విద్యార్థి రాహుల్ డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి మార్చిరీకి తరలించారు. రాహుల్ ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు… అతని ఆత్మహత్యకు గల కారణాలను పరిశోధిస్తున్నారు. ల్యాప్ టాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఐటీ నిపుణులు. ల్యాప్ ట్యాప్ ఓపెన్ అయితే ఏమైనా వివరాలు తెలిసే ఛాన్స్ వుందని అంటున్నారు. ఫ్రీజర్ లో రాహుల్ మృతదేహం వుంది. రాహుల్ ఎంటెక్ రెండో ఏడాది చదువుతున్నాడు. రాహుల్ తల్లిదండ్రులు ఈ వార్త విని కన్నీరుమున్నీరు అవుతున్నారు. నంద్యాల నుంచి బయలుదేరారు రాహుల్ పేరెంట్స్. రాహుల్ గురించి తోటి విద్యార్దులను ఆరా తీస్తున్నారు పోలీసులు.
Read Also: Mother Killed Daughter: ప్రియుడి కోసం కన్నకూతుర్ని కడతేర్చిన తల్లి