Hyd Rains : హైదరాబాద్ నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. గంటల వ్యవధిలోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువుల్లా మారి, ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వర్షం కారణంగా చోటుచేసుకున్న ఘటనలు నగరాన్ని షాక్‌కు గురి చేశాయి. అసిఫ్‌నగర్ అఫ్జల్‌సాగర్ ప్రాంతంలోని మంగారుబస్తీలో దురదృష్టకర సంఘటన జరిగింది. మామ, అల్లుడు కలిసి నాలా దాటే క్రమంలో జారి నీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటికీ ఇద్దరి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
Mirai : మిరాయ్ భారీ రికార్డు.. ఆ ముగ్గురు హీరోలను దాటేసిన తేజ
మరోవైపు గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ హాల్ ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దోమలగూడ, చిక్కడపల్లి, గాంధీనగర్ వంటి పలు ప్రాంతాల్లో కాలనీలు పూర్తిగా నీటమునిగాయి.
బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, నారపల్లి, బషీర్‌బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్, బేగంబజార్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, గచ్చిబౌలిలో మోస్తరు నుంచి కుండపోత వర్షం పడింది. అప్రత్యాశిత వర్షం కారణంగా జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై, నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. నగరంలో వర్షపాతం కొనసాగుతుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Vijayawada: రీల్స్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. యువకుడిని తిట్టిన సీఐ.. విజయవాడలో ఉద్రిక్తత..!
