Site icon NTV Telugu

Orange Alert : హైదరాబాద్‌ వాసులరా.. ఫోన్‌లు, లైట్‌లు ఛార్జింగ్‌ పెట్టుకొండి..!

Rains Hyderabad

Rains Hyderabad

Orange Alert : ఇవాళ మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షాలు చుట్టుముట్టాయి. వర్షం కారణంగా ఇప్పటికే పలు రహదారులు నీటమునిగిపోగా, ట్రాఫిక్ జామ్‌లతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైండ్ స్పేస్, ఐకియా చౌరస్తా, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీ చెక్ పోస్ట్, PVNR ఫ్లైఓవర్, జేబీఎస్, తిరుమలగిరి, లక్షీకపూల్ వంటి ముఖ్య ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగి, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు.

హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వర్షం మరింత ముమ్మరంగా కురిసే అవకాశం ఉన్నందున, పౌరులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. తక్కువ సమయంలో అధిక వర్షపాతం ఉండవచ్చని, ట్రాఫిక్ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశముందని హెచ్చరించింది.

Chhattisgarh: నారాయణాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోయిస్టులు మృతి..

భారీ వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగే అవకాశం ఉంచవచ్చు. కాబట్టి పౌరులు తమ సెల్‌ఫోన్లు, చార్జింగ్ లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగానే పూర్తిగా చార్జ్ చేసుకోవడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో DRF (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చని హైదరాబాదు మునిసిపల్ అధికారులు తెలిపారు.

వర్ష సమయంలో అవసరం లేని ప్రయాణాలను నివారించండి. నీటితో మునిగిన రోడ్లను దాటేందుకు ప్రయత్నించకండి. వర్షం కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, కరెంట్ వైర్ల దగ్గర జాగ్రత్తలు పాటించండి. DRF హెల్ప్‌లైన్ నంబర్లను రికార్డ్‌లో ఉంచుకొని, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించండి. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే నీరు చేరిపోతున్నందున, అత్యవసరంగా మున్సిపల్ అధికారులు మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్‌ను పంపారు. భారీ వర్షాల కారణంగా రాత్రి సమయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

My Baby Review : మై బేబీ రివ్యూ

Exit mobile version