Site icon NTV Telugu

Hyderabad: ఎల్బీనగర్‌లో కుప్పకూలిన ఫ్లైఓవర్ ..పలువురికి గాయాలు..

Lb Nagar

Lb Nagar

హైదరాబాద్ లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది..ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మిస్తున్న ఓ నూతన ఫైఓవర్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణం చేస్తుండగా ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులకు గాయాలవ్వగా.. వారందరిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రమాద సమయంలో కూలీలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు.. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో అందరు ఉలిక్కి పడ్డారు..

ఇక ఘటనా స్థాలానికి ఇంజినీర్ల బృందం చేరుకోనుంది. ఫ్లై ఓవర్ కూలి పోవడానికి గల కారణాలను ఏంటనే దానిపై ఇంజినీర్ల బృందం పరిశీలన చేపట్టనుంది. నేడు ఇంజినీర్ల బృందం ఘటనా స్థలానికి చేరుకునే అవకాశముంది. నాణ్యత లేకుండా నిర్మించడమే కారణమా..? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది ఇంజినీరింగ్ నిపుణుల టీమ్ తేల్చనుంది. ఈ ఘటనతో స్థానికులు అర్థరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.. ప్రస్తుతం డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు.. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఈ ప్రమాదం లో గాయపడిన వారందరూ ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందినవారిగా చెబుతున్నారు. మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఒక్క సారిగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రాత్రి మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్ప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  ఎల్బీనగర్ బైరమలగూడలో ఫ్లైఓవర్ కూలిపోయిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు సంబందించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు త్వరలోనే తెలిపనున్నారు… గాయపడిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించనున్నట్లు సమాచారం..

Exit mobile version