Site icon NTV Telugu

CM Revanth Reddy : భార‌తీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైద‌రాబాద్

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : భారతీయ సినీ పరిశ్రమకు హైదరాబాదు కేంద్ర బిందువుగా మారాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సినీ రంగ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్‌లో వివిధ విభాగాల్లో ఎంపికైన పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను వారు సీఎంకు వివరించారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపు

ఆ తర్వాత అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి, ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ, అదే చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పనిచేసిన వెంకట్, శ్రీనివాస్, వారి బృందం, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, ‘బేబి’ సినిమా దర్శకుడు సాయి రాజేశ్, గాయకుడు రోహిత్‌లను సీఎం ఘనంగా అభినందించారు. కార్యక్రమంలో ‘హనుమాన్’ నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, ‘బేబి’ నిర్మాత ఎస్కేఎన్, ‘భగవంత్ కేసరి’ నిర్మాత గారపాటి సాహు తదితరులు పాల్గొన్నారు.

Harinya Reddy: బిగ్ బాస్ కీలక టీం మెంబర్, ప్రొడ్యూసర్.. రాహుల్ చేసుకోబోయే అమ్మాయి షాకింగ్ బ్యాక్ గ్రౌండ్

Exit mobile version