Site icon NTV Telugu

Hyderabad:కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో ట్విస్ట్‌.. శ్వేతా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Family Susaid

Family Susaid

హైదరాబాద్​ సరూర్​ నగర్​ పీఎస్​ పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యాయత్నం సంచ‌లంగా మారిన విష‌యం తెలిసిందే.. బిల్లుల విషయంలో ఓ కాంట్రాక్టర్​ మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు బాధితులు. బంధువుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరడంతో ప్రాణాపాయం తప్పింది.

అయితే.. సరూర్ నగర్ కుటుంబ ఆత్మహత్యయత్నం బాధితులు శశికుమార్ భార్య శ్వేతా త‌న ఆవేద‌న అధికారుల‌కు వెల్ల‌డించింది. దినేష్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అందుకే త‌ను, త‌న‌ భర్త , ఇద్దరు పిల్లలు చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.

దినేష్ రెడ్డి వద్ద ఎలక్ట్రికల్ సబ్ కాంట్రాక్టర్ గా త‌న‌ భర్త పని చేస్తున్నాడ‌ని, 2019 ఫిబ్రవరి నెల నుండి దినేష్ రెడ్డి అనే వ్యక్తి మాకు డబ్బులు ఇవ్వడం లేదని క‌న్నీరుమున్నీర‌య్యింది. సుమారు 2కోట్ల రూపాయలు వారికి ఇవ్వాలని తెలిపింది. డబ్బులు ఇవ్వమని కోరితే మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాడని వాపోయింది. చనిపోయే ముందు మేము చనిపోతున్నాము మా డబ్బులు మాకు ఇవ్వమని కోరిన చస్తే చావండి అని అన్నాడని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇద్దరు పిల్లలతో సహా మేము నిద్ర మాత్రలు వేసుకున్నామని తెలిపింది. దినేష్ రెడ్డి నుండి రావాల్సిన డబ్బులు వారికి ఇప్పించండి, న్యాయం చెయ్యండి అని కోరుతున్నామ‌ని పేర్కొంది.

బాధితుడు శశి కుమార్..పిల్లలు రఘు,వరుణ్

విటమిన్ టాబ్లెట్స్ వేసుకోండి అని మాకు 2 టాబ్లెట్స్ ఇచ్చారని బాధితుడు శశి కుమార్..పిల్లలు రఘు, వరుణ్ తెలిపారు. అవి వేసుకోగానే చేదుగా ఉండడంతో మేము వాంతులు చేసుకున్నాము. మేము ఆడుకునేందుకు హోటల్ కిందకి వెళ్లి వచ్చే లోపు అమ్మ, నాన్న బెడ్ పైన పడి ఉన్నారు. మాకు దినేష్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి. మా నాన్న అడుగుతుంటే బూతులు తిడుతున్నారు. మాకు న్యాయం చెయ్యండని శ‌శికుమార్ పిల్లలు వేడుకున్నారు.

బాధితుడు శశికుమార్ బావమరిది సురేష్

దినేష్ రెడ్డి అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుండి మా కుటుంబాన్ని వేధిస్తున్నాడని బాధితుడు శశికుమార్ బావమరిది సురేష్ పేర్కొన్నారు. డబ్బులు అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడ‌ని వాపోయాడు. మా బావ వాళ్ళు చివరిగా అడిగిన ఏమైనా చేసుకోండి అని మాట్లాడాడని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అతని వెనుక రాజకీయ పలుకుబడి ఉందనే ధైర్యంతోనే.. త‌న‌ని ఏమీ చేయ‌లేమనే.. మా వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఆత్మహత్య చేసుకుంటున్నామని మాకు ఫోన్ చేయడంతో భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసామని బావ‌మ‌రిది సురేష్ తెలిపారు. పోలీసులు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశార‌ని దాంతో ప్రాణాప్రాయం త‌ప్పింద‌ని క‌న్నీరుమున్నీర‌య్యాడు. ఇలా మళ్ళీ ఆత్మహత్యకు పాల్పడితే బాద్యులు ఎవరు? అని ప్ర‌శ్నించాడు. వెంటనే దినేష్ రెడ్డి ద‌గ్గ‌ర వున్న తమ డబ్బును .. తమకు ఇప్పించాల‌ని డిమాండ్ చేశారు.

Exit mobile version