NTV Telugu Site icon

Nude Video Call: పోచారం ఐటీ కారిడార్ లో విద్యార్థికి న్యూడ్‌ వీడియో కాల్ కలకలం..

Nude Vedio Call

Nude Vedio Call

Nude Video Call: పోచారం ఐటీ కారిడార్ లో విద్యార్థికి నగ్న వీడియో కాల్ కలకలం రేపింది. ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థికి వాట్సాప్‌కు దీక్షికా అగర్వాల్‌ పేరిట వీడియో కాల్‌ వచ్చింది. విద్యార్థి వీడియోకాల్ లిప్ట్ చేయగానే.. ఎలా ఉన్నారు.. బాగున్నావా..లా చదువుతున్నావు.. పరీక్షలు ఎప్పుడు.. అంటూ కాల్ లో మాట్లాడింది. ఆమె అడిగిన ప్రశ్నలకు విద్యార్థి సమాధానం ఇస్తుండగానే హఠాత్తుగా యువతి నగ్నంగా మారింది. షాక్ తిన్న విద్యార్థికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతోనే వీడియో కాల్ కట్ అయ్యింది. నిమిషాల్లో మళ్లీ ఆ విద్యార్థికి వాట్సప్‌లో వీడియోలు వచ్చాయి. ఏంటని పరిశీలించగా.. నగ్న వీడియోను రికార్డు చేసి విద్యార్థికి పంపింది ఆయువతి.

Read also: Election Results 2024 Live UPDATES: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్..

అందులో తాను కూడా మాట్లాడటం ఉండటంతో భయాందోళన చెందాడు విద్యార్థి. ఆవెంటనే సదరు యువతి విద్యార్థికి కాల్ చేసి డబ్బులు పంపాలని డిమాండ్‌ చేసింది. లేదంటే ఈ వీడియోలు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించింది. దీంతో భయాందోళన చెందిన విద్యార్థి మూడు విడతలుగా ఆన్‌లైన్‌లో రూ. 20 వేలు డబ్బులు పంపాడు. అయితే మరిన్ని సార్లు డబ్బులు పంపాలని యువతి బెదిరించడంతో భయంతో విద్యార్థికి పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దీక్షికా అగర్వాల్‌ అనే యువతి ఎవరు? యువతి వీడియో కాల్‌ డేటా, డబ్బులు పంపిన నెంబర్లలను పరిశీలిస్తున్నారు. ఈ వీడియోకాల్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి. డబ్బులు ఎవరి అకౌంట్‌ లో పడ్డాయనే దానిపై ఆరా తీస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్‌ నుంచి కాల్స్‌ వస్తే స్పందించవద్దని సూచించారు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Show comments