MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
- దాండియా వేడుకలో కూలిన లైటింగ్ పోల్
- చికిత్స పొందుతూ విద్యార్థిని సోనీ మృతి
- ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన ముగ్గురి అరెస్ట్
- కళాశాల యాజమాన్యంపైనా పోలీసుల కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివార్లలోని నాదర్గుల్ ఎంబీఎస్‌ఆర్ (MVSR) ఇంజనీరింగ్ కళాశాలలో దసరా వేడుకల సందర్భంగా నిర్వహించిన దాండియా కార్యక్రమంలో జరిగిన తీవ్ర విషాదంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. లైటింగ్ పోల్ కూలిపడిన ఘటనలో ఒక విద్యార్థిని మృతి చెందగా, మరో 25 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారకులైన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన ముగ్గురు వ్యక్తులను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు.
స్టూడెంట్ సోనీ నారాయణ దాస్ మృతి..
ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని సోనీ నారాయణ దాస్ చికిత్స పొందుతూ మృతి చెందగా, గాయపడిన మిగతా 25 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్‌లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
Also Read
- Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
- Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
- Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
- Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
సురక్షిత ప్రమాణాలు గాలికి..
ఈవెంట్ నిర్వహించిన ‘సాకేత్’ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించిందని విచారణలో తేలింది. భారీ లైటింగ్ పోల్‌ను సరైన సపోర్ట్ లేదా గట్టి పునాది లేకుండా నాసిరకంగా ఏర్పాటు చేయడం వల్లే అది అకస్మాత్తుగా కూలిపడి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈవెంట్ మేనేజర్ సాకేత్ కంపెనీకి చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. దీనితో పాటు, క్యాంపస్‌లో విద్యార్థుల భద్రతా ప్రమాణాలను విస్మరించి, సరైన అనుమతులు, పర్యవేక్షణ లేకుండా ఈవెంట్‌కు అనుమతించినందుకు గాను ఎంబీఎస్‌ఆర్ కళాశాల యాజమాన్యం (Management) పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. యువత భద్రతతో చెలగాటమాడే ఎలాంటి నిర్లక్ష్యాలను సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
-
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!