పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రత అంశం విషయంలో బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఉద్దేశిస్తూ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సిద్ధార్థ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైనాపై సిద్ధార్థ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సిద్ధార్థ్‌పై సెక్షన్ 67 యాక్టు, ఐపీసీ 509 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.
Read Also: బాలయ్య అభిమానులకు సారీ చెప్పిన స్టార్ డైరెక్టర్
అయితే అంతకుముందే సైనాకు సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తాను కేవలం జోక్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ ట్వీట్ చేశానని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. ఆ వ్యాఖ్యలు చాలా మందిని బాధించేలా ఉన్నందున తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు. సైనా ఎప్పటికీ మన ఛాంపియనే అంటూ రాసుకొచ్చాడు. దీనిపై సైనా నెహ్వాల్ కూడా స్పందించింది. ‘సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పినందుకు సంతోషం. ఓ మహిళను ఈ విధంగా లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయకూడదు. జరిగిందేదో జరిగింది. నేను దీని గురించి బాధ పడట్లేదు. సంతోషంగానే ఉన్నాను. అతడికి దేవుడు తోడుగా నిలవాలి’ అంటూ సైనా ట్వీట్ చేసింది.
