బేగంపేట్ ట్రాఫిక్ డైవర్షన్ రూట్‌ని పరిశీలించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. పికెట్ నాలా నిర్మాణ పనుల కారణంగా దారి మళ్ళింపు ప్రాంతాల్ని పరిశీలించిన సీపీ ఆనంద్ పలు సూచనలు చేశారు. నాలా మరమ్మత్తుల పనులను పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ పీవీ ఆనంద్…అక్కడ అమలు అవుతున్న ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ మళ్ళింపులను పరిశీలించారు. ఆయన వెంట ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ రంగనాథ్ వున్నారు.
జూన్ 4వ తేదీ వరకు బేగంపేట్ రసూల్ పుర వరకు ఆంక్షలు కొనసాగిస్తామన్నారు సీపీ ఆనంద్. రసూల్‌పురా నాలా మరమ్మతుల కారణంగా అమలవుతున్న ఆంక్షలు ట్రాఫిక్ నియంత్రణ పై తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ట్రాఫిక్ పోలీసులతో చర్చించారు సీపీ. సీటీవో నుంచి వచ్చే వాహనాలను హనుమాన్‌దేవాలయం మీదుగా మళ్ళిస్తామన్నారు. బేగంపేట నుంచి వాహనాలను రసూల్‌పురా నుంచి కిమ్స్ వైపుగా మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉండడంతో వాహనదారులు సహకరించాలని కోరారు నగర సీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ రంగనాథ్.
Read Also: Pawan Kalyan Eluru Tour: రైతు కుటుంబానికి పవన్ పరామర్శ.. రూ.లక్ష చెక్కు అందజేత
