NTV Telugu Site icon

కుదిపేస్తున్న జోక‌ర్ సాఫ్ట్‌వేర్.. ఐదు సార్లు డిలీట్ చేసినా..!

Joker Software

కరోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో అంద‌రినీ భ‌య‌పెడుతోంది జోకర్ సాఫ్ట్‌వేర్.. దీనిబారిన‌ప‌డి యువత తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు.. ఇప్పటికే గూగుల్ ఐదుసార్లు జోక‌స్ సాఫ్ట్‌వేర్‌ను డిలీట్ చేసింది.. అయినా.. మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూనే ఉంది.. యువ‌త‌ను దెబ్బ‌కొడుతూనే ఉంది.. ముఖ్యంగా మెట్రో నగరాలను జోకర్ సాఫ్ట్‌వేర్ కుదిపేస్తూనే ఉంది.. వివిధ పద్ధతుల్లో మొబైల్ ఫోన్స్, డెస్క్ టాప్‌ల‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూనే ఉంది.. ఆ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలోకి సంబంధిత వ్య‌క్తుల‌ వ్యక్తిగత సమాచారం వెళ్లిపోతోంది.. బ్యాంకు వివ‌రాల నుంచి వ్యక్తిగత ఫొటోల వ‌ర‌కు అన్నీ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయ‌ని.. జోకర్ సాఫ్ట్‌వేర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని హెచ్చ‌రిస్తున్నారు హైద‌రాబాద్ సీపీ అంజనీకుమార్‌.. ఇక‌, జోకర్ సాఫ్ట్‌వేర్ నుంచి ఏదైనా సమాచారం వస్తే వెంటనే సైబ‌ర్ కంట్రోల్ రూమ్‌కి స‌మాచారం ఇవ్వాల‌ని.. 94906 16555 నెంబర్ కి కాల్ చేసి జోకర్ సాఫ్ట్‌వేర్ సంబంధిత స‌మాచారం చెప్పాల‌ని సూచించారు సీపీ అంజ‌నీకుమార్.