CM Revanth Reddy : హైదరాబాద్‌లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన
- హైదరాబాద్‌లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన
- ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రేవంత్
- మైత్రివనం, బల్కంపేట్ ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన
- అమీర్‌పేట్ గంగుబాయి బస్తీలో సీఎం రేవంత్
- ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రేవంత్
- బల్కంపేటలో ముంపు కాలనీలను పరిశీలిస్తున్న సీఎం రేవంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా ముంపు ప్రాంతాలను పర్యటించారు. మైత్రివనం, బల్కంపేట్, అమీర్‌పేట్ ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా అమీర్‌పేట్‌లోని గంగుబాయి బస్తీ, బల్కంపేట్‌లోని ముంపు ప్రభావిత కాలనీల్లో ప్రజల పరిస్థితి, నష్టాలను పరిశీలించారు.
ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో సీఎం మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ మరియు సంబంధిత అధికారులను వెంటబెట్టుకొని పర్యటించిన సీఎం, వరదనీటి ప్రవాహం, డ్రైనేజీ వ్యవస్థ, సహాయక చర్యలపై వివరాలు కోరారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని మోహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
- RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి మునిగిన రహదారులు, ఇళ్లలోకి ప్రవేశించిన వరదనీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనంగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.
ఈ పర్యటనలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు కూడా సీఎం వెంట ఉన్నారు. హైదరాబాద్‌లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!