Site icon NTV Telugu

HYD CP CV Anand : డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది

కోవిడ్‌ టైంలో కొంత మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది అమ్మాయిలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద బయట కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్నారని, డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. ఓచ్చే 10 సంవత్సరాల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎంప్లాయ్ మెంట్ రెండు మాదక ద్రవ్యాలు అని ఆయన పేర్కొన్నారు. పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

గ్రామీణ ప్రాంతాలలో కూడా మాదక ద్రవ్యాలు గంజాయి లభిస్తున్నాయని, అటవీ ప్రాంతల నుండి వీటిని రవాణా చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయానా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సీపీ తెలిపారు. వెయ్యి మంది పోలీసులతో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ & నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మాదక ద్రవ్యాలు అమ్మిన కొన్న కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Exit mobile version