హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్… ఇవాళ ప్రకటన !

Huzurabad Bypoll

Huzurabad Bypoll

హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లను నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా..ఇవాళ హుజురాబాద్‌ ఉప ఎన్నికపై గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌.. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అంతేకాదు.. తమ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ పార్టీలో యువ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో… గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.