NTV Telugu Site icon

ఆత్మ గౌరవం అంటే వ్యాపారాలు పెంచుకోవడమేనా…?

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ బీసీ కమిషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడుతూ… ఆత్మ గౌరవం వ్యాపారాలు పెంచుకోవడమేనా అని ఈటలను ప్రశ్నించారు. మీ వెంట ఎవరూ లేరు ఓడిపోతారని భయంతో రాజీనామా చేయడం లేదు. అధినేత కేసీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు మానుకోండి ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. తెరాస తరఫున గెలిచి స్థానిక సంస్థల ప్రతినిధులు తెరాసలో కొనసాగడం అమ్ముడుపోవడం ఎలా అవుతుంది. పార్టీలో ఉండి అధినేతపై పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణారాహిత్యం కాదా అని అడిగారు. దేశానికి ఆదర్శవంతమైన సంక్షేమ పథకాల పై మీ వ్యాఖ్యలు మీ నిజస్వరూపానికి ప్రతీక అని అన్నారు. ఇన్నాళ్లుగా మీరు అనుభవిస్తున్న పదవులు హుజూరాబాద్ కమలాపూర్ నియోజకవర్గ ప్రజల త్యాగాలవి కాదా… నిజాలు ఒప్పుకునే మనస్తత్వం ఎలాగో లేదు… కనీసం మీ పెంపుడు మిత్రులతో విమర్శలను ఆపండి అని పేర్కొన్నారు.