NTV Telugu Site icon

కరీంనగర్ సీవీఎం హాస్పిటల్ పై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం…

కరీంనగర్ సీవీఎం ప్రైవేటు హాస్పిటల్ నిర్వకంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీవీ కథనాలను సుమోటోగా స్వీకరించింది మానవ హక్కుల కమిషన్. సీవీఎం హాస్పిటల్ లో వెంటిలేటర్ సరిగా లేక రోగి మరణించాడు. అయితే చనిపోయిన విషయం చెప్పకుండా.. ఫైనల్ బిల్లు చెల్లించాలని కుటుంబసభ్యులను వేధింపులకు గురి చేసారు హాస్పిటల్ సిబ్బంది. ఈ ఘటన పై ఎన్టీవీ చూపిన కథనాలపై స్పందించిన హెచ్చార్సీ… కలెక్టర్, DMHO కు నోటీసులు పంపింది. ఆ ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకుని, ఘటన పై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే జూన్ 29కి ఈ కేసు తదుపరి విచారణ వాయిదా వేసింది.