జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద నీరు కొనసాగుతుంది. హిమాయత్‌సాగర్‌లోకి ప్రస్తుతం 800 క్యూసెక్కుల వచ్చి చేరుతుంది. హిమాయత్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.10 అడుగులకు నీరు చేరింది. దాంతో హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా మూసీ లోకి 700 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
ఇక ఉస్మాన్ సాగర్ లోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1789.50 అడుగులుగా ఉంది. అయితే ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్ల ఎత్తి మూసీ లోకి 1360 క్యూసెక్కుల నీరును విడిచి పెడుతున్నారు అధికారులు.