Huge Steroid Injections Caught In Hyderabad: ఈమధ్య యువత ఫిట్‌నెస్‌పై ఎంత ఫోకస్ పెట్టిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందరిలో హ్యాండ్సమ్‌గా, కండలు తిరిగిన బాడీతో మాచో మ్యాన్‌లాగా కనిపించడం కోసం.. గంటల తరబడి కసరత్తు చేస్తున్నారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా జిమ్‌లోనే కాలం గడుపుతున్నారు. అంతేకాదండోయ్.. రకరకాల డైట్ ప్లాన్స్ ఫాలో అవుతున్నారు. కొందరు మెడిసిన్స్ కూడా తీసుకుంటుంటారు. ఇలాంటి వారినే టార్గెట్ చేసుకొని.. ఓ ముఠా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్‌ని విక్రయిస్తోంది. ఈ ఇంజెక్షన్లు తీసుకుంటే.. తక్కువ కాలంలోనే బాడీ ఫిట్ అవుతుందని, ఎక్కువగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉండదని ఓ ముఠా నమ్మబలికింది. అనతి కాలంలోనే, ఎక్కువగా కష్టపకుండా బాడీ ఫిట్ అవుతుందని చెప్తే.. ఎవరు టెంప్ట్ అవ్వకుండా ఉంటారు చెప్పండి? ఆ ముఠా మాటలు నమ్మి, కొందరు యువకులు ఆ ఇంజెక్షన్స్ కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.
WTC 2023 Final: భారత్ ఫైనల్‌కు చేరాలంటే.. అది తప్పకుండా జరిగి తీరాలి
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టి, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్నాక.. పోలీసులు వారిపై నిఘా పెట్టి, అడ్డంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 180 ఇంజెక్షన్లు, 1100 ట్యాబ్‌లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సయ్యద్, నరేష్, ఓం ప్రకాశ్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిలో ఓం ప్రకాశ్ ప్రధాన నిందితుడు. విశాఖకు చెందిన ఇతను.. గత కొంతకాలం నుంచి హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కూకట్‌పల్లిలో ఫ్రీలాన్సింగ్ జిమ్ ట్రైనర్‌గా పని చేసే ఓం ప్రకాశ్.. ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే అతడు యువతకు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తమ విచారణలో తేల్చారు. తక్కువ సమయంలో బాడీ బిల్డింగ్స్ కోసం స్టెరాయిడ్స్ వాడుతుంటారని.. దీని వల్ల గుండెపోటు, హార్మోన్స్ సమస్య తలెత్తుతాయని డాక్టర్లు చెప్తున్నారు.