తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్ట శ్రీఅంజనేయ స్వామి ఆలయం నేడు హనుమాన్ జయంతి సందర్భంగా కాషాయమయంగా మారింది. దీంతో కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు కొండగట్టు చేరుకున్నారు. దీంతో అంజన్న దర్శనానికి అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించకునేందకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. హనుమాన్ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఆలయ పరిసరాలు జై శ్రీరామ్.. హనుమాన్ నామస్మరణతో మారుమోగుతున్నాయి. అయితే.. హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవికాలం ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లును సైతం ఏర్పాటు చేశారు. స్వామి వారి దర్శనానికి సుమారు. 4 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.