Telangana: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభిస్తోంది. వైన్ షాపుల కోసం భారీ పోటీ నెలకొంది. ఎంతలా అంటే.. మూడు రోజుల్లోనే రెండువేలకు పైగానే దరఖాస్తులు వచ్చాయంటే మనవాళ్లతోటి అట్లుంటది అనిపిస్తుంది. వైన్ షాపుల కోసం భారీ పోటీ నెలకొంది. ఎంతలా అంటే.. మూడు రోజుల్లోనే రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు డిమాండ్ మామూలుగా లేదు. దీంతో… ఈసారి మద్యం దుకాణాలను స్వాధీనం చేసుకుంటే.. కాసుల వర్షం కురుస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గాను సోమవారం (ఆగస్టు 8) 2000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు కింద 2 లక్షలు చెల్లిస్తున్నారు. 2023-25 నాటికి తెలంగాణలో మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సులు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుండగా.. కొత్త లైసెన్సుల కోసం ఈ నెల 4 నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.
Read also: Rahul Gandhi: రాహుల్‌కు అధికార నివాసంగా ఆ బంగ్లానే కేటాయింపు !
జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా రాజకీయ నేతలు, వారి అనుచరులు దరఖాస్తు చేసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో మిగిలిన 3 రోజుల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే 350 దరఖాస్తులు వచ్చాయంటే పోటీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 చివరి తేదీ. ఇప్పుడు ఇలా దరఖాస్తులు వెల్లువెత్తుతుంటే.. అప్పటికి ఇంకా ఎన్ని దరఖాస్తులు వస్తాయో..! 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన దరఖాస్తులన్నింటి నుంచి లాటరీ విధానంలో ఆగస్టు 21వ తేదీన మద్యం షాపుల లైసెన్స్‌లు కేటాయిస్తారు.
గత నోటిఫికేషన్ లో నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ.1,350 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈసారి అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చూద్దాం.. ఎన్నికల జాతరలో ఖజానాకు ఎన్ని కోట్లు వస్తాయో..!!
Perni Nani : రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే కుట్ర.. చంద్రబాబుది శకుని మెదడు