Site icon NTV Telugu

TS Police : హైదరాబాద్‌లో భారీగా బదిలీలు..

Cp Cv Anand

Cp Cv Anand

హైదరాబాదు నగర పరిధిలోని పోలీశ్‌ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. నగరంలోని 2865 మంది పోలీస్‌ సిబ్బందిని బదిలీ చేస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ ఉత్వర్వులు జారీ చేశారు. పోలీసు కానిస్టేబుల్స్-2006, హెడ్ కానిస్టేబుల్-640, ఏఎస్ఐలు -219 మందిని బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కోవిడ్ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా వీరి బదిలీలు పెండింగ్ ఉన్నట్లు ఆయన తెలిపారు. 5 నుండి 7 సంవత్సరములు లాంగ్ స్టాండింగ్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆన్ లైన్ ద్వారా బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. బదిలీలో తెలంగాణ పోలీసులు రూపొందిచిన యాప్ హెచ్‌ఆర్‌ఎంఎస్‌ది కీలక పాత్ర అని సీపీ ఆనంద్‌ వ్యాఖ్యానించారు.

Exit mobile version