హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన 100మందికి పైగా నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములవ్వాలనే తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… దళితబంధు పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరు అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దు. బీజేపీ పార్టీ వాళ్ళు దళితబంధు ఆపాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన దళిత బంధు పథకం అమలు ఆగదు. దేశంలోనే ఒక గొప్ప పథకంగా దళితబంధు పథకం చరిత్రలో నిలవబోతుంది. దళిత సోదర సోదరీమణులు కుడా ఆందోళన చెందవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి దళితబంధు అందుతుంది. రేపు శాలపల్లిలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమావేశానికి 15000 వేల మందికిపైగా కమలాపూర్ మండలం నుండి స్వచ్చందంగా తరలివెతున్నారు.
బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల విధి విధానాలు నచ్చకనే ఈ రోజు ఆయా పార్టీలను వీడి తెరాసలో చేరుతున్నారు. కేసీఆర్ గారి బాటలో నడుస్తూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవ్వడానికి వచ్చే ప్రతిఒక్కరిని స్వాగతిస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక సామాన్య కుటుంబాల జీవనం ఎంతో భారంగా మారింది. నిత్యావసర ధరలు,గ్యాస్,చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఇక్కడ గెలిచిన ఎంపీ 2 సంవత్సరాలుగా ఒక్క రూపాయి పనిచేసిన దాఖాలు లేవు. ప్రజల కష్టాలు తెలవని నీకు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్థావని ప్రశ్నిస్తున్న అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ గారు ఒక్కో సామాజికవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు రైతాంగానికి అండగా నిలిచి రైతుల సంక్షేమానికి కృషిచేస్తున్న ఘనత కేసీఆర్ ది అని పేర్కొన్నారు.