NTV Telugu Site icon

Edupayala Temple: జల దిగ్బంధంలో ఏడు పాయల ఆలయం.. అమ్మవారి పాదాలను తాకిన వరద నీరు

Edupayala Temple

Edupayala Temple

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం రెండు రోజుల పాటు రాష్ట్రంపై ప్రభావం చూపనుంది. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్టోబర్ 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నిన్న సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.

 

ఎగువన కురుసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తివేశారు అధికారులు. సింగూరు ప్రాజెక్ట్‌ నాలుగు గెట్లను ఎత్తి వేసి దిగువకు నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. జల దిగ్బంధంలోకి ఏడు పాయల ఆలయం వెళ్లింది. వరద నీరు అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించాయి. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరానది ప్రవహిస్తుంది. ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో. ఆలయంలో తాత్కాలికంగా మూసివేసారు అధికారులు. రాజగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు కొనసాగుతున్నాయి. దీంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిరాశ ఎదురవుతుంది.

Read also: Kadapa Penna River: ఉగ్రరూపం దాల్చిన పెన్నా.. భయాందోళనలో ప్రజలు

ఇవాళ రాష్ట్రంలోని కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ములుగు, కరీంగనార్, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
Edupayala Temple: జల దిగ్బంధంలో ఏడు పాయల ఆలయం.. అమ్మవారి పాదాలను తాకిన వరద నీరు

Show comments