ఇవాళ్టి నుంచి మృగశిర కార్తె ప్రారంభమైంది. కృత్తిక, రోహిణి కార్తెల్లో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఇక మృగశిర కార్తె అనగానే చేపలు గుర్తొస్తాయి. మృగశిర కార్తె నాడు చేపలు తినడం ఆనవాయితీగ మన పూర్వీకుల కాలం నుంచే వస్తోంది.
మృగశిర కార్తె ఇవాల్టి నుంచి మొదలై 15 రోజుల పాటు ఉంటుంది. ఐతే మృగశిర కార్తె తొలి రోజున చేపలు తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకే పల్లెల్లో ఏ చెరువుల వద్ద చూసిన సందడి కనిపించే దృశ్యాలు దర్శనమిస్తుంటాయి. చేపలు కొనేందుకు ప్రజలు మార్కెట్లకు చేరుకోవడంతో.. మార్కెట్లన్నీ రద్దీ కనిపిస్తాయి. రేట్లు కూడా అమాంతం పెరుగుతాయి.
కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాటుందని, వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం. దీంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లు, రైతుబజార్లలో చేపల కోసం జనాలు క్యూకడుతున్నారు. జలపుష్పాల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కాగా, కార్తెను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెద్దఎత్తున చేపలు తెప్పించి అమ్ముతున్నారు.
హైదరాబాద్‌లోని ముషీరాబాద్, రాంగనర్ చేపల మార్కెట్‌కు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్‌లోని ఆకునీడు, భీమవరం నుంచి పెద్దఎత్తున చేపలు దిగుమతి అయ్యాయి. దీంతో చేపల కోసం పెద్ద సంఖ్యలో రావడంతో చేపల మార్కెట్ జనం కిటకిటలాడుతున్నారు.
ఈ కార్తె వస్తే చాలు రైతులు ఏరువాకకు సిద్ధమవుతుంటారు. అందుకే ఈ కార్తెను ఏరువాక సాగే కాలం అంటుంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో నైరుతి ప్రవేశంతో తొలకరి జల్లులు కురుస్తుంటాయి. దీంతో పొలాలు దున్ని పంటలు వేయటం ప్రారంభిస్తుంటారు. మృగశిర కార్తె ఆరంభమైన రోజును వివిధ ప్రాంతాల్లో పలు పేర్లతో పండగ జరుపుకుంటారు.
Iran: పట్టాలు తప్పిన రైలు.. 10 మంది మృతి