Site icon NTV Telugu

Bhatti Vikramarka: మైనర్లకు పబ్బులో అనుమతి ఎలా ఇచ్చారు..?

Bhatti

Bhatti

మైనర్ల కు పబ్బులు అనుమతి ఎలా ఇచ్చారు..? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిప‌డ్డారు. జూబ్లీహిల్స్ ప‌బ్ భాగోతం పై స్పందిచిన ఆయ‌న.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విరుచుకుప‌డ్డారు. పబ్బులు పై నియంత్రణ ఉండదా..? అంటూ ప్ర‌శ్నించారు. పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హోంమంత్రికి అసలు అధికారాలే లేవు అంటూ ఎద్దేవ చేశారు. మైనర్లను పబ్బుల్లో అనుమతి ఇచ్చిన వారిపై.. పబ్బూ పై చర్యలు తీసుకోవాలని, అత్యాచారం కేసులో నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని విమ‌ర్శించారు.

అధికార పార్టీ సొంత వాళ్ళకే పబ్బులు అనుమతి ఇవ్వడం తోనే ఇలాంటి సమస్యలు వ‌స్తున్నాయ‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో పబ్బులు నియంత్రణ లేకుండా పోయిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. పోలీసులు ప్రభుత్వానికి భయపడి నిందితులపై చర్యలు తీసుకోవట్లేదని విమ‌ర్శించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని డిమాండ్​ చేశారు. డ్రగ్స్‌ అడ్డాగా హైదరాబాద్‌ మారిందని, రాష్ట్రంలో మాదకద్రవ్యాలను రూపుమాపాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Errabelli Dayakar Rao : వెంటనే ఆ నిధులు వచ్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలి

Exit mobile version