Congress leaders: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీక్ కేసులో రాజకీయ నేతలపై సిట్ దృష్టి సారించింది. ఈ కేసులో నిందితులను విచారిస్తున్న సిట్ రాజకీయ ఆరోపణలు చేస్తున్న వారిపై దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా.. కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ సిట్ విచారణకు రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వీ.హనుమంత రావును పోలీసులు హౌస్ చేశారు. రేవంత్ విచారణ నేపథ్యంలో నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సీట్ కార్యాలయానికి కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిపివేసిన పోలీసులు. పేపర్ లీక్ పై తన ఆరోపణల పట్ల ఆధారాలను సమర్పించాలని రేవంత్ కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Read also: Thieves New Plan: తెలివిమారిన దొంగలు.. ఆశ పడ్డ మహిళలు.. చివరకు ఏమైందంటే ?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీక్ కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ టార్గెట్ అని విమర్శించారు. మంత్రి కేటీఆర్ వద్ద పనిచేస్తున్న వ్యక్తికి సొంత గ్రామంలోనే పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని ఆరోపించారు. సున్నితమైన ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే రాజకీయ ఆరోపణలు చేసిందని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఇప్పుడు నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇందులో ఆరోపించినట్లుగా ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది.. ఎటువంటి ఆధారాలు ఉన్నాయో వాటితో సహా హాజరు కావాలని పేర్కొంది. ఈనేపథ్యంలో సిట్ ముందుకు రేవంత్ రెడ్డి ఇవాళ హాజరుకానున్నారు. ఎటువంటి ఆధారాలు సిట్ కు ఇవ్వనున్నారు. ఎవరెవరి పేర్లను రేవంత్ సిట్ కు ఇవ్వనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రేవంత్ , సిట్ విచారణ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్ కార్యాలయానికి సిట్ చీఫ్ ఏ ఆర్ శ్రీనివాస్, నగర జాయింట్ సిపి & సిసిఎస్ ఇంచార్జ్ గజరావు భూపాల్ చేరుకున్నారు.
Tspsc paper leak case: 6వ రోజుకు చేరిన విచారణ.. నేడు సిట్ ముందుకు రేవంత్ రెడ్డి