NTV Telugu Site icon

Honour Killing: భువనగిరిలో పురువు హత్య..

Honour Killing

Honour Killing

యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది.. రెండు రోజుల క్రితం అదృశ్యమైన సస్పెన్షన్‌కు గురైన హోంగార్డు రామకృష్ణ మృతదేహమై కనిపించడంతో కుటుంబసభ్యులు షాక్‌ తిన్నారు.. అయితే, రామకృష్ణ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది… కొన్ని నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న రామకృష్ణ.. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు.. అయితే, రామకృష్ణని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు..

Read Also: Astrology: ఏప్రిల్‌ 17, ఆదివారం దినఫలాలు

గతంలో హోంగార్డుగా పనిచేసిన రామకృష్ణ.. సస్పెండ్‌ అయ్యాడు.. అప్పటి నుంచి రియల్‌ ఎస్టేట్‌ చేసుకుంటున్నాడు.. అదే ఇప్పుడు రామకృష్ణ ప్రాణం తీసునట్టుగా తెలుస్తోంది.. రామకృష్ణను ట్రాప్‌ చేసి కిడ్నాప్‌ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. రామకృష్ణ మామనే.. అతడిని కిడ్నాప్‌ చేసి.. హత్య చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.. రెండో రోజుల క్రితం అదృశ్యమైన రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట వద్ద గుర్తించారు.. కాగా, గతంలోనూ పరువు కోసం కన్నకూతుళ్లను లేదా తన కూతురుని పెళ్లి చేసుకున్న యువకుడిని హత్య చేసిన ఘటనలో ఎన్నో ఉన్నాయి.. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.