Honey Trap: ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్.. దేశవిదేశాల్లోని యువకులను ముంచేసిన కేటుగాడు..

Kkk

Kkk

హైదరాబాద్‌లోని సైదాబాద్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన హనీట్రాప్ కేసులో కస్టడీ విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ విచారణలో నిందితుడు పవన్ కుమార్ వికృత చేష్టలను, అతడి భారీ మోసాల నెట్‌వర్క్‌ను బట్టబయలు చేశారు. ఈ కేసులో నిందితుడు పవన్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో “Moon baby 5973” పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అమ్మాయిలా నటిస్తూ పలువురికి వల విసిరాడు. ఈ క్రమంలో మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థితో పరిచయం పెంచుకుని, ఆపై అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆత్మహత్య చేసుకుని, ఆ నెపాన్ని బాధితుడిపై నెట్టి జీవితం నాశనం చేస్తానని బెదిరించి లొంగదీసుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది.

అనంతరం నిందితుడి ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన పోలీసులకు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పవన్ కుమార్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా పాకిస్తాన్, టర్కీ, కెనడా వంటి విదేశాల్లో ఉన్న వారిని సైతం హనీట్రాప్‌లోకి దించినట్లు గుర్తించారు. బాధితుల జాబితాలో సమాజంలో ఉన్నత హోదాల్లో ఉన్న వైద్యులు, పోలీసులు, వ్యాపారవేత్తలు, లెక్చరర్లతో పాటు డెలివరీ బాయ్స్ కూడా ఉన్నట్లు తేలింది.

ఆపై పరిచయం పెంచుకున్న వారితో చాకచక్యంగా ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు సేకరించి, వాటితో భయభ్రాంతులకు గురిచేస్తూ భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. అంతేకాకుండా ఆ వీడియోలను ఇతర ప్రైవేట్ ఖాతాల్లోకి అప్‌లోడ్ చేసినట్లు ఆధారాలు లభించాయి. నిందితుడికి గతంలోనూ నేర చరిత్ర ఉందని, రెండేళ్ల క్రితం కపిల్ చిట్ ఫండ్స్‌లో పనిచేస్తున్నప్పుడు సహ ఉద్యోగిని రుణాల పేరుతో మోసం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సైదాబాద్ పోలీసులు ఈ కేసులో మరికొందరు బాధితులు ఉన్నారనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.