Government Land Auction:ఆదాయం సమకూర్చునేందుకు అన్వేషణ మొదలు పెట్టింది తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములను వేలం వేసి ఆర్థిక వనరులను సమకూర్చునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు ప్లాట్లను వేలం వేయాలని HMDA నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడ, గండిపేటలోని 366 సర్వే నెంబర్‌లో ఉన్న 41 వేల 971 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు విక్రయానికి ఉండగా.. వాటి ధర గజానికి 60 వేలు, 35వేలు, లక్షా 10 వేలుగా ఒక్కో చోట ఒక్కో విధంగా ధరను నిర్ణయించారు.
Read Also: CBI Raids: జేసీ ట్రావెల్స్ ఫోరర్జీ కేసు.. రంగంలోకి సీబీఐ
ఇక సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, ఆర్‌సీపురం, అమీన్‌పూర్, జిన్నారం ప్రాంతాల్లో 41 వేల 38 గజాలు…. మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్, కూకట్‌పల్లి, గండిమైసమ్మ, కుత్బుల్లాపూర్‌లో 25 వేల 228 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లను విక్రయించనున్నట్టు నోటిఫికేషన్‌లో తెలిపింది HMDA. ప్రాంతాన్ని బట్టి ధర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు వేలాలకు సంబంధించి ప్రీ బిడ్ సమావేశం… జనవరి 4న రంగారెడ్డి, 5న సంగారెడ్డి, 6న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించనున్నారు. ప్లాట్ల వేలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజుకు జనవరి 16 వరకు అవకాశం ఇచ్చారు అధికారులు. ఈఎండీ చెల్లింపునుకు జనవరి 17 వరకు గడువు విధించింది. ఇక, జనవరి 18 భూముల వేలం ప్రక్రియ చేపట్టనుంది. ఇందుకు సంబంధించి జనవరి 4,5,6 తేదీల్లో ప్రీబిడ్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా హెచ్‌ఎండీఏ తెలిపింది. ఇక, గతంలో కూడా ప్రభుత్వ భూముల వేలం ద్వారా కేసీఆర్ సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరిన విషయం విదితమే.
