Site icon NTV Telugu

కోకపేటలో భారీగా పలికిన ప్లాట్ల ధర..

Land Auction

Land Auction

హెచ్‌ఎండీఏ.. కోకాపేట భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది… అధికారులు అంచనా వేసినకంటే ఎక్కువ ధరకు అమ్మాడు పోయాయి భూములు… ఈ వేలం ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్టు చెబుతున్నారు.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలికినట్టు తెలుస్తోంది.. దీనికి కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు అధికారులు.. ఔటర్‌ రింగ్‌రోడ్డు పక్కనే ఉన్న ఈ వెంచర్‌కు నియోపొలిస్‌ గా పేరు పెట్టారు అధికారులు.. అయితే, ఈ ఆక్షన్‌లో 60 మందికి పైగా బిడ్డర్స్ పాల్గొన్నారు.. ఎకరాకు 25 కోట్లు అప్సెట్ ధర ఫిక్స్ చేసినా.. డిమాండ్ ను బట్టి ఎకరాకు రూ.50 కోట్ల వరకు వస్తుందని అధికారులు అంచనా.. వేసినా.. అంచనాలు మించి రూ.60 కోట్లుగా పలికినట్టు తెలుస్తోంది.

Exit mobile version