Site icon NTV Telugu

అలెర్ట్‌: హిమాయత్‌సాగర్‌కు భారీ వరద.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తివేత..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్‌ శివారులోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. దీంతో.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తేవేసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. హిమాయత్ సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1763.05 అడుగులకు చేరింది.. ఇక, ఇన్‌ఫ్లో కూడా భారీగానే ఉండడంతో.. గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.. ఇవాళ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మొదట ఒక్కో గేటు ఫీటు వరకు ఎత్తి మూసీలోకి నీటిని వదలనున్నారు అధికారులు.. మరోవైపు.. మూసీ పరివాహక ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి సూచించింది.. హిమాయత్‌సాగర్‌లోకి ప్రస్తుతం 2000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ వరద ఇలాగే కొనసాగితే.. మరిన్ని గేట్లు కూడా ఎత్తివేసే అవకాశం ఉంది. కాగా, ఈ ఏడాది ఇప్పటికే ఓసారి హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version