HILT Policy : హిల్ట్ పాలసీ లీక్‌ అవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌

  • HILT పాలసీ లీక్‌ అవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌
  • అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశం
  • పాలసీని తీసుకురావాలని కసరత్తు చేస్తున్న దశలో లీకైన సమాచారం
  • నవంబర్‌ 20నే ఫోటోషాప్‌ స్లైడ్స్‌ బయటకు వచ్చినట్లు అనుమానం
  • నవంబర్‌ 21న హిల్ట్‌ పాలసీపై ప్రెస్‌మీట్‌ పెట్టిన కేటీఆర్‌
  • నవంబర్‌ 22న జీవో విడుదల చేసిన ప్రభుత్వం.
Ts Gov Logo

Ts Gov Logo

HILT Policy : హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకురావాలని భావించిన కీలక విధాన నిర్ణయం (HILT Policy) జీవో విడుదల కాకముందే ప్రతిపక్షాలకు లీక్ కావడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్గతంగా ఈ కీలక సమాచారం బయటకు ఎలా వచ్చిందనే దానిపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించి, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పారిశ్రామిక భూములపై హిల్ట్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్న దశలోనే, ఈ సమాచారం బయటకు లీకైంది. నవంబర్ 20వ తేదీ నాడే ఈ పాలసీకి సంబంధించిన ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్టుగా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ లీకేజీ జరిగిన మరుసటి రోజు, అంటే నవంబర్ 21న, ప్రతిపక్ష నాయకుడైన కేటీఆర్ హిల్ట్ పాలసీపై మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నవంబర్ 22న ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది.

జీవో రాకముందే ఈ సమాచారం ప్రతిపక్షాలకు చేరడంపై సర్కార్ తీవ్రంగా సీరియస్ అయింది. పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ సమయంలోనే ఈ కీలక సమాచారాన్ని ఎవరు లీక్ చేశారు అనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు ఇప్పటికే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అయితే, ఈ వ్యవహారం తీవ్రత దృష్ట్యా, ముందే సమాచారాన్ని లీక్ చేసిన వారిని గుర్తించడానికి , దీని వెనుక ఉన్న అంతర్గత కారణాలను తెలుసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ తర్వాతే లీకేజీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Chitrapuri Colony Scam: చిత్రపురి కాలనీ అక్రమాల కేసు.. ఫైనల్ రిపోర్టులో పలువురు సినీ పెద్దల పేర్లు!