HILT Policy : హిల్ట్ పాలసీ లీక్ అవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
- HILT పాలసీ లీక్ అవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
- అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
- పాలసీని తీసుకురావాలని కసరత్తు చేస్తున్న దశలో లీకైన సమాచారం
- నవంబర్ 20నే ఫోటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్లు అనుమానం
- నవంబర్ 21న హిల్ట్ పాలసీపై ప్రెస్‌మీట్ పెట్టిన కేటీఆర్
- నవంబర్ 22న జీవో విడుదల చేసిన ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HILT Policy : హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకురావాలని భావించిన కీలక విధాన నిర్ణయం (HILT Policy) జీవో విడుదల కాకముందే ప్రతిపక్షాలకు లీక్ కావడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్గతంగా ఈ కీలక సమాచారం బయటకు ఎలా వచ్చిందనే దానిపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించి, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పారిశ్రామిక భూములపై హిల్ట్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్న దశలోనే, ఈ సమాచారం బయటకు లీకైంది. నవంబర్ 20వ తేదీ నాడే ఈ పాలసీకి సంబంధించిన ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్టుగా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ లీకేజీ జరిగిన మరుసటి రోజు, అంటే నవంబర్ 21న, ప్రతిపక్ష నాయకుడైన కేటీఆర్ హిల్ట్ పాలసీపై మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నవంబర్ 22న ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
జీవో రాకముందే ఈ సమాచారం ప్రతిపక్షాలకు చేరడంపై సర్కార్ తీవ్రంగా సీరియస్ అయింది. పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ సమయంలోనే ఈ కీలక సమాచారాన్ని ఎవరు లీక్ చేశారు అనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు ఇప్పటికే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అయితే, ఈ వ్యవహారం తీవ్రత దృష్ట్యా, ముందే సమాచారాన్ని లీక్ చేసిన వారిని గుర్తించడానికి , దీని వెనుక ఉన్న అంతర్గత కారణాలను తెలుసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ తర్వాతే లీకేజీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Chitrapuri Colony Scam: చిత్రపురి కాలనీ అక్రమాల కేసు.. ఫైనల్ రిపోర్టులో పలువురు సినీ పెద్దల పేర్లు!
తాజావార్తలు
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!