NTV Telugu Site icon

Attack on Hijras: హిజ్రాలపై పెళ్లి బృందం గొడ్డళ్లతో దాడి.. కాళ్లు మొక్కినా కనికరించలేదు..

Attack On Hijras

Attack On Hijras

Attack on Hijras: హిజ్రాలపై ఫంక్షన్ హాల్ సిబ్బంది దాడి చేసి చితకబాదిన సంఘటన కరీంనగరంలో జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.

Read also: Boy Falls into Borewell: విషాదం.. 200 అడుగుల బోరుబావిలో పడి ఐదేళ్ల బాలుడు మృతి

అల్గునూర్ ఉన్నతి ఫంక్షన్ హాల్ లో పోరండ్ల గ్రామానికి చెందిన వారి వివాహ వేడుక జరుగుతోంది. విషయం తెలుసుకున్న కొందరు కరీంనగర్‌కు చెందిన హిజ్రాలు ఫంక్షన్ హాల్‌కు వెళ్లారు. పెళ్లికొడుకు నుంచి కొంత డబ్బును కానుకగా ఇవ్వాలని కోరారు. అయితే పెళ్లి కొడుకు బంధువులు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. అయినా హిజ్రాలు చాలా దూరం నుంచి వచ్చామని కాస్తైన డబ్బులు ఇవ్వాలని వేడుకున్నారు. దీంతో అక్కడున్న ఫంక్షన్ హాల్ మేనేజర్, మరికొందరు సిబ్బంది హిజ్రాలపై దాడికి దిగారు. మాట మాట పెరిగి అదికాస్త ఇనుప రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేసేంతగా వెళ్లింది. విచక్షణారహితంగా హిజ్రాలపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. అక్కడ జరుగుతున్న ఘటనను ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన హిజ్రాలను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే.. సోమవారం హిజ్రాల ఫిర్యాదు మేరకు ఫంక్షన్ హాల్ మేనేజర్, సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎల్‌ఎండీ ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు. హిజ్రాలపై దాడి చేయడం నేరమని, డబ్బులు అడిగితే లేదని చెప్పాలిగాని ఇలా దాడిచేయడం నేరమన్నారు. దీనిపై దర్యాప్తు చేసి దాడిచేసిన వారిపై కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
TSPSC Paper Leak: TSPSC పరీక్ష రద్దుపై ఉత్కంఠ.. మధ్యాహ్నం రానున్న క్లారిటీ