Site icon NTV Telugu

Hijra Fighting : నడిరోడ్డుపై కొట్టకున్న హిజ్రాలు..

Hijra Fighting

Hijra Fighting

నడిరోడ్డుపై రెండు వర్గాలకు చెందిన హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన రాజేంద్ర నగర్‌లోని హసన్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లాల్ దర్వాజా నుండి రాజేంద్రనగర్ ప్రాంతానికి వచ్చి డబ్బులు వసూల్ చేస్తున్నారు ఓ వర్గం హిజ్రాలు. దీంతో.. మా ఏరియా లో మీరు ఏలా డబ్బులు వసూలు చేస్తారంటూ మరో వర్గం హిజ్రాలు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటుచేసుంది. ఈ క్రమంలోనే ఓ వర్గం పై మరో వర్గం దాడి చేశారు.

దీంతో హసన్ నగర్‌లో నడి రోడ్డుపైనే రాళ్లతో, కర్రలతో హిజ్రాలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల హిజ్రాలను చెదరగొట్టారు. అంతేకాకుండా పలువురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Exit mobile version