Power Consume : తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తు సరఫరాతో ఇది మరింత అధికమవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వేసవికాలం కారణంగా భానుడు వేడికి ఇంటి నుండి బయటకు అడుగుపెట్టాలేని పరిస్థితి వచ్చేస్తోంది.. దీంతో.. విద్యుత్ వినియోగం కూడా క్రమంగా పెరిగిపోతోంది. తెలంగాణలో ఈ రోజు ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది విద్యుత్ డిమాండ్.. ఈ విషయాన్ని తెలంగాణ ట్రాన్స్‌కో అండ్ జెక్సో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు… ఇవాళ సాయంత్రం 3.54 నిమిషాలకు ఏకంగా 13,857 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలిపారు.
రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధిక విద్యుత్ డిమాండ్ అని, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక విద్యుత్ వినియోగంగా నమోదైనట్లు పేర్కొన్నారు. 3 రోజుల క్రితం 13,742 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా ఇవాళ 13,857 మెగా వాట్లు నమోదైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వ్యవసాయ రంగం, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగిందని, ఒకటి రెండు రోజుల్లోనే 14,000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ రావచ్చు అంటున్నారు విద్యుత్ అధికారులు.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
తాజావార్తలు
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు