Site icon NTV Telugu

Hyderabad: క‌ర్మ‌న్‌ఘాట్ వ‌ద్ద ఉద్రిక‌త్త‌… భ‌జ‌రంగ్‌ద‌ళ్ కార్య‌క‌ర్త‌లు అరెస్ట్‌…

క‌ర్మ‌న్ ఘాట్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దుండ‌గులు గోవుల‌ను అక్ర‌మంగా బులెరో వాహ‌నంలో త‌ర‌లిస్తున్నార‌ని తెలుసుకున్న గౌ ర‌క్ష‌క్ స‌భ్యులు ఆ వాహ‌నాన్ని క‌ర్మ‌న్ ఘాట్ వ‌ద్ద అడ్డుకున్నారు. దీంతో ఆగ్ర‌హించిన దుండ‌గులు ఇన్నోవో వాహ‌నాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. క‌త్తుల‌తో దాడులకు దిగారు. దీంతో గౌ ర‌క్ష‌క్ స‌భ్యులు ద‌గ్గ‌ర‌లో ఉన్న ఆంజ‌నేయ దేవాల‌యంలోకి ప‌రుగులు తీశారు. ఆల‌యంలోకి ప్ర‌వేశించి క‌త్తుల‌తో గౌ ర‌క్ష‌క్ స‌భ్యుల‌పై దాడులు చేశారు. విష‌యం తెలుసుకున్న హిందూసంఘాలు, భ‌జ‌రంగ్ దళ్ కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో క‌ర్మ‌న్‌ఘాట్‌కు చేరుకొని రోడ్డుపై భైటాయించారు.

Read: Mekapati Goutham Reddy: నెల్లూరు నుంచి ప్రారంభ‌మైన అంతిమ‌యాత్ర‌…

దుండ‌గుల‌ను అదుపులోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. పోలీసులు అక్క‌డికి చేరుకొని లాఠీచార్జ్ చేయ‌డంతో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీఛార్జ్ లో భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌ల‌కు గాయాల‌య్యాయి. దీంతో ఆగ్ర‌హించిన కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌పై రాళ్ల‌దాడి చేశారు. రాళ్ల దాడిలో పోలీసుల వాహ‌నాల అద్దాలు ధ్వంసం కాగా, ప‌లువురు పోలీసుల‌కు గాయాల‌య్యాయి. భ‌జ‌రంగ్ దళ్ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version