Site icon NTV Telugu

Rohit Reddy: నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ

Rohithreddy

Rohithreddy

Rohit Reddy: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరగనుంది. ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ ను రోహిత్‌ రెడ్డి దాఖలు చేసిన విషయం తెలిసిందే.. పిటిషన్ లో నలుగురుని ప్రతివాదులుగా చేర్చారు. యూనియన్ ఆఫ్ ఇండియా, ఈడీ, జాయింట్ డైరెక్టర్ ఈడీ, అసిస్టెంట్ డైరెక్టర్ లను రోహిత్ రెడ్డి ప్రతి వాదులుగా చేర్చారు. ECIR 48/2022 క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈసీఐఆర్ 48/2022 లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా కోర్ట్ ఆదేశాలు ఇవ్వాలంటు పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘనకు ఈడి పాల్పడిందని పిటిషన్ లో తెలిపారు రోహిత్‌ రెడ్డి. ఈడి తదుపరి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని రోహిత్ రెడ్డి కోరారు. అన్నింటినీ పరిశీలించి ఈడీ దర్యాప్తు పై స్టే ఇవ్వాలని రోహిత్ రెడ్డి కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడంతో నిన్న ఈడీ విచారణకు హాజరుకాలేదు.

Read also: Mallikarjun Kharge: కాంగ్రెస్ కార్యకర్తలకు భారత్ జోడో యాత్ర “సంజీవిని”

మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. సిట్‌ కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన 63ను కొట్టేసింది. కేసు దర్యాప్తును వెంటనే చేపట్టాలని జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. కేసుకు సంబంధించిన కీలక వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించిన అనంతరం నిందితులు పడుతున్న ఆందోళనలను తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. సిట్ విచారణ పక్షపాతంగా జరుగుతోందన్న నిందితుల వాదనలో అర్థం ఉందన్నారు. సిట్, మొయినాబాద్ పోలీసుల వద్ద ఉన్న అన్ని పత్రాలను సీబీఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దని సిట్‌ను ఆదేశిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అన్ని మెటీరియల్‌లు, పత్రాలను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
Gold Shine in 2023: వచ్చే ఏడాది.. మాంద్యం వచ్చినా.. రాబడి తగ్గినా.. నో ఎఫెక్ట్‌..

Exit mobile version