NTV Telugu Site icon

Medchal: కోర్టు ధిక్కరణ కేసు.. మేడ్చల్ కలెక్టర్ తోపాటు మరో ఇద్దరికి నోటీసులు..

Telangana High Court

Telangana High Court

Medchal: కోర్టు ధిక్కరణ కేసులో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రూ, కాప్రా తహసీల్దారు సుచరిత, కాప్రా డిసి ముకుంద్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన వ్యవహరించిన అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో అధికారులకు హై కోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రూ, కాప్రా మండల తహసీల్దారు సుచరిత, కాప్రా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డికి కోర్ట్ ధిక్కరణ కింద ఎందుకు వారిమీద తగిన చర్యలు తీసుకోవద్దు తెరపాలంటూ నోటీసులో పేర్కొంది. విచారణను వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారించింది. పిటిషనర్ తరుపు న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపిస్తూ కాప్రా మండలం సర్వే నంబర్ 152 లోని 13 ఎకరాలకు సంబంధించి అన్ని యజమాని హక్కులు, అనుమతులు ఉన్నప్పటికి రెవిన్యూ అధికారులు సదరు భూమిని కస్టడీయన్ భూమిగా ప్రకటిస్తూ.., అనధికారికంగా సదరు భూమిలో ప్రభుత్వ బోర్డు పెట్టారని తెలిపింది.

Read also: GST Council Meet : నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. ఆన్ లైన్ గేమింగ్, ఎరువుల పై చర్చ

అది చట్ట విరుద్ధంగా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని 2022 సంవత్సరంలో అడ్రిన్ సొసైటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం సదరు భూమి పట్టా భూమి అని ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. యధాస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కానీ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ సదరు భూమిలో నాలా తవ్వకం, బ్రిడ్జి వేయడం, చెత్త వాహనాలు నిలుపుతూ చెత్త సేకరణ చేయడం లాంటి కార్యాకలాపాలు నిర్వహిస్తుండటంతో కాజా అనిల్ కుమార్, మేకల నవీన్ నాయుడు అడ్రిన్ సొసైటీ సభ్యుల తరుపున జిపిఎ హోల్డర్స్ హోదాలో ఈ పిటీషన్ దాఖలు చేసారు. దీంతో కోమేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రూ, కాప్రా తహసీల్దారు సుచరిత, కాప్రా డిసి ముకుంద్ రెడ్డిలకు ర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Hyderabad Murders: భయాందోళన రేపుతున్న వరుస హత్యలు.. ఇవాళ మరో మర్డర్..