High alert in the agency maoist varotsavalu warangal telangana: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మావోల అలజడి నెలకొంది. మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. పెద్దపల్లి, గోదావరి ఖని, మంథిని, కాళేశ్వరం ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. కోల్డ్ బెల్ట్ ఏరియాల్లో మావోల సంచారంపై ఆరాతీస్తున్నారు ఇంటిలిజెన్స్ అధికారులు. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నట్లు ప్రచారం అవుతున్న నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు సెర్చ్ కొనసాగుతుంది.కూలీలుగా మావో యాక్షన్ టీమ్ లు ప్రవేశించినట్లు సమాచారంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసారు. ఇక ఏజెన్సీలోని ఆదివాసి గూడాలను జల్లెడ పడుతున్న పరిస్థితి నెలకొంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని అటవీప్రాంతంలో భద్రతాబలగాల కూంబింగ్ నిర్వహించారు. దీంతో.. మావోయిస్టు కీలక నేతలు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సంచరిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో.. ఆయా గ్రామాల్లో పోలీసుల సమావేశాలు నిర్వహించారు. ఇక మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Read also:Cambodia: కాంబోడియాలో చిక్కుకున్న కరీంనగర్ యువకులు.. విదేశాంగకు బండిసంజయ్ లేఖ
మావోయిస్టుల కదలికల నేపథ్యంలో సెప్టెంబర్ 4 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఇక ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులను జల్లెడ పడుతున్నారు. దీంతో.. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గోదావరి నదీ పరివాహక గ్రామాలు.. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా.. గోదావరిఖని, మంథని, పార్వతీ బ్యారేజీ, సరస్వతి పంపు హౌజ్, కాళేశ్వరం, మహాదేవ్ పూర్ ప్రాంతాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు అధికారులు.
Anti-Hijab Protest In Iran: అధికారులు కొట్టడంతోనే నా కూతురు చనిపోయింది: మహ్సా అమిని తండ్రి
