Site icon NTV Telugu

High Alert: కొత్తగూడెం జిల్లాలో హైఅలర్ట్‌.. ఏపీలోని 6 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు..

Kottagudam

Kottagudam

High Alert: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అనంతారం, కవాడిగుండ్ల, తండాలోని చెరువులు, కుంటలు కోతకు గురవుతున్నాయి. ఆ నీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టులోకి చేరింది. దీంతో గురువారం నదికి వరద ఉధృతి పెరిగింది. దీనికి తోడు ఎగువన ఉన్న కొండలు, గుట్టల నుంచి కూడా వరద నీరు ప్రాజెక్టులోకి చేరడంతో నీటిమట్టం పొంగిపొర్లడంతో రెండు చోట్ల గట్టు కూలిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతంలోని గుమ్మడవల్లి గ్రామంలోని 300 కుటుంబాలు, కొత్తూరు గ్రామంలోని 200 కుటుంబాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Read also: Olympics India: వేరే దేశాలకు ఒలంపిక్ పతకాలు సాధించిన భారత సంతతి క్రీడాకారులు ఎవరో తెలుసా..?

రెండు చోట్ల ప్రాజెక్టు ఎప్పుడు దెబ్బతింటుందో తెలిసే పరిస్థితి లేదని ఆయా గ్రామాల ప్రజలకు వివరించారు. ప్రజలంతా చీకట్లో ఆందోళనకు గురవుతున్నారు. పోలీసు, రెవె న్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అక్కడే మకాం వేసి పరిస్థితిని అంచనా వేస్తూ, వరదల స్థాయిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. అయితే ప్రాజెక్టు వరద నీరు దిగువకు వెళ్తుండడంతో ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం గుల్లవాయి, మాధారం, రెడ్డిగూడెం, మరో నాలుగు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరంతా గ్రామాల మీదుగా ప్రవహించి రుద్రంకోట వద్ద గోదావరిలో కలుస్తోంది.
Chandipura Virus : చండీపురా వైరస్ కారణంగా గుజరాత్‌లో 14 మంది మృతి

Exit mobile version