Site icon NTV Telugu

Breaking News: సికింద్రాబాద్‌ వద్ద మళ్లీ ఉద్రిక్తత..

Railway Station

Railway Station

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రిపథ్‌ స్కీంపై దేశ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళన కారులు వింధ్వంసం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఇప్పటికీ ఆందోళన కారులు రైల్వే స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది.

అయితే రైల్వే స్టేషన్‌ను పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో.. కొంతమంది ఆర్మీ అభ్యర్థులు బిక్కుబిక్కుమంటూ రైళ్లలో దాక్కుంటుండగా.. మరికొంతమంది రైల్వే స్టేషన్‌ నుంచి పరుగులు పెడుతున్నారు. ఆందోళన కారులను తరలించేందుకు రైల్వే స్టేషన్‌ బయట వాహనాలను సిద్ధం చేశారు.

Exit mobile version