Polling Centers: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1500 మంది పోలీసులతో పాటు కేంద్రపాలగాలతో భారీ బందోబస్తు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 318 పోలింగ్ ప్రాంతాలుండగా, 560 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 48 సమస్యాత్మక ప్రాంతాలుగా, 58 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది వెళ్తున్నారు.
Read also: Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్ కింద దర్శనమిచ్చిన ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు
ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరుగుతుంది. వేములవాడ నియోజకవర్గంలో మొత్తం 2,26,188 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 1,08,091, మహిళలు 1,18,065, ఇతరులు 32 మంది ఉన్నారు. ఇక 1500 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో లోక్ సభ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక కేంద్ర బలగాల పహారా కాస్తున్నారు. జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ వెల్లడించారు. మొత్తం పోలింగ్ ప్రాంతాలు 318 కాగా.. పోలింగ్ కేంద్రాలు 560 ఉన్నాయి. క్రిటికల్ ప్రాంతాలు 48 ఉండగా.. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 58గా వున్నాయి.
Read also: Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్ కింద దర్శనమిచ్చిన ఖలిస్థాన్ కు మద్దతుగా నినాదాలు
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి స్వాధీన పరుచుకున్న వాటి వివరాలు:
1. స్వాధీనపరచుకున్న నగదు 82,11,362/- రూపాయలు.
2.లిక్కర్ లీటర్ల లో 1664.93 సుమారుగా అంచనా విలువ 10,20,222 /-రూపాయలు.
3.గంజాయి, 9 కిలోల 209 గ్రాముల గంజాయి, 16 కేసులు నమోదు
4.జిల్లాలో ఇప్పటివరకు 446 కేసులలో 1078 మంది బైండోవర్.
6.ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 16 కేసులు నమోదు.
7.జిల్లా లో ఉన్న మొత్తం 23 లైసెన్స్డ్ తుపాకులు డిపాజిట్.
Read also: Jammu Kashmir: బందిపొరాలో ఒక ఉగ్రవాది అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
మరోవైపు నల్గొండ జిల్లా అనధికారికంగా ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు నమోదుకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పిఓ, ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందిపై కేసుల నమోదుకు కలెక్టర్ ఉపక్రమించారు. నాగార్జునసాగర్, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సిబ్బంది గైర్హాజరయ్యారు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Accident : రీల్ పిచ్చితో ట్రైన్ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు