మామూలు రోజుల్లో ఆదివారం వస్తే ఉదయం మధ్యాహ్నం వరకు నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా రద్దీ కనిపిస్తుంది. కానీ, ఇది కరోనా కాలం. నిబంధనలు అమలౌతున్న రోజులు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఉన్నది. దీంతో ఉదయం 6 గంటల నుంచి నాన్ వెజ్ మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. భారీ సంఖ్యలో క్యూలు కట్టారు. ముషీరాబాద్ చేపల మార్కెట్ వద్ద ఇసుకేస్తే రాలనంత మంది జనాలు చేరడంతో కరోనా నిబంధనలు గాలికెగిరిపోయాయి. సోషల్ డిస్టెన్స్ మచ్చుకైనా కనిపించలేదు. కేవలం నాలుగు గంటలు మాత్రమే సడలింపులు కావడంతో నాన్ వెజ్ కోసం ప్రజలు ఎగబడ్డారు. దీంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. చికెన్ తో పాటుగా మటన్ ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. ఆదివారం మార్కెట్లు కరోనా హాట్ స్పాట్ లు మారుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్తున్నా ప్రజలు చెవికెక్కించుకోవడం లేదు.
ఆదివారం స్పెషల్: ఎటు చూసినా రద్దీనే… కనిపించని కరోనా భయం…
