Site icon NTV Telugu

Heavy Rain: నేడు, రేపు భారీ వర్షాలు.. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

Heavy Rains

Heavy Rains

Heavy Rain: తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 28, జూలై 15, 19, ఆగస్టు 3, 29, సెప్టెంబర్ 5, 13, 23 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలకు లానినో ప్రభావంతో భారీగా విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో ఇటీవల వర్షం కురిసింది. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఇక దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో అనుబంధ ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంపై స్థిరమైన అల్పపీడనం బుధవారం బలహీనపడింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో 123.3, సూర్యాపేట జిల్లా టేకుమట్‌లో 56.5, ఆదిలాబాద్‌ జిల్లా బజరహత్నూర్‌లో 46, వరంగల్‌ జిల్లా ఏనుగల్‌లో 45, సంగారెడ్డి జిల్లా మల్చెల్మలో 44.8, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Deputy CM Pawan Kalyan: నేడు జనసేనలోకి కీలక నేతలు.. కండువా కప్పి ఆహ్వానించనున్న పవన్‌..

Exit mobile version